ప్రపంచరికార్డు సృష్టించిన హైదరాబాదీ బాలిక

ప్రపంచరికార్డు సృష్టించిన హైదరాబాదీ బాలిక

01-01-2018

ప్రపంచరికార్డు సృష్టించిన హైదరాబాదీ బాలిక

చేతుల్తో పెయింటింగ్‌ అందరూ చేయగలరు. కానీ కాలితో పెయింటింగ్‌ వేయడం కొంచెం కష్టమే. అలా కాలితో పెయింటింగ్‌ వేసి, హైదరాబాదీ బాలిక జాహ్నవి మాగంటి ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం బ్రిటన్‌లోని వేర్విక్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌, ఇండస్ట్రీ ఆర్గనైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న జాహ్నవి, కాలితో 140 చదరపు అడుగుల పెయింటింగ్‌ వేసి ప్రపంచ రికార్డుకెక్కింది. ఇలా వేసిన పెయింటింగుల్లో జాహ్నవి వేసిన పెయింటింగ్‌ అతి పెద్దది. 100 చదరపు అడుగుల కాలి పెయింటింగ్‌తో ఉన్న రికార్డును జాహ్నవి తిరగరాసింది. కాలి వేళ్ల మధ్య పెయింటింగ్‌ బ్రష్‌ పట్టుకుని, చాలా సునాయాసంగా పెయింటింగ్‌ని పూర్తి చేసింది. పెయింటింగ్‌ మాత్రమే కాదు నటన, డ్యాన్సింగ్‌, గానం వంటి కళల్లో కూడా జాహ్నవికి ప్రావీణ్యం ఉంది. ఆమె కాలేజీ స్థాయిలో బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ కూడా.