2019లో విజయం మాదే

2019లో విజయం మాదే

01-01-2018

2019లో విజయం మాదే

2019 ఎన్నికల్లో  కేంద్రంలో, తెలంగాణలో విజయం కాంగ్రెస్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దూరదర్శన్‌ మాజీ జేడీ సుజాత్‌అలీ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ లౌకికత్వం, సామాజిక న్యాయమున్న పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ హామీ 40 నెలలైనా అమలు కాలేదని చెప్పారు. రిజర్వేషన్లపై మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ముస్లింల ఓట్లు అడిగే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదన్నారు. పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభం కాకపోవడం  పాతనగరంపై వివక్ష చూపడమేనని విమర్శించారు.