కుంభమేళాగా మేడారం జాతర!

కుంభమేళాగా మేడారం జాతర!

30-12-2017

కుంభమేళాగా మేడారం జాతర!

తెలంగాణలో అతి పెద్ద జాతర సమ్మక్క- సారక్క జాతరను మరో కుంభమేళాగా గుర్తించేందుకు కృషి చేస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయేల్ ఓరాం వెల్లడించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ కోట్లాది మంది గిరిజనులు, భక్తులు హాజరయ్యే ఈ జాతర గురించి తెలంగాణ బీజేపీ నాయకులు తనకు వివరించినట్టు తెలిపారు. గిరిజన మంత్రిత్వ శాఖలో దీనిపై చర్చించి మరో కుంభమేళాగా గుర్తించేందుకు కృషి చేస్తానని తెలిపారు.