టీఆర్‌ఎస్‌ వైపు జంపన్న చూపు?

టీఆర్‌ఎస్‌ వైపు జంపన్న చూపు?

30-12-2017

టీఆర్‌ఎస్‌ వైపు జంపన్న చూపు?

మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించి తాజాగా జన జీవన స్రవంతిలో కలిసిన నర్సింహారెడ్డి అలియాస్‌ జంపన్న, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశాలున్నాయా? అంటే అవుననే వాదానలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జంపన్న, ఇటీవల పోలీసులకు లొంగిపోయి జనజీవనస్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టుల ఉద్యమంలో కీలక నేతగా కొనసాగిన జంపన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారన్న ప్రచారం వరంగల్‌ రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. అనారోగ్య పరిస్థితుల్లో వైద్యం సహాయం అవసరమైన జంపన్నకు, అధికార పార్టీ నేతలే పోలీసుల ముందు లొంగిపోయేందుకు అన్ని విధాలుగా సహకరించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.