మరువలేని మధురానుభూతి…

మరువలేని మధురానుభూతి…

29-12-2017

మరువలేని మధురానుభూతి…

మెట్రోరైలులో ప్రయాణించి తాను మరువలేని మధురానుభూతిని పొందానని అమెరికా కాన్సులెట్ జనరల్ కెథరిన్ బి.హద్ద అన్నారు. గురువారం ఆమె మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్‌రెడ్డి, డీసీపీ బాలకృష్ణతో కలిసి ఆమె రసూల్‌పురా నుంచి మెట్టుగూడ వరకు మెట్రోరైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా రసూల్‌పురా, మెట్టుగూడ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు కల్పించిన ఆధునిక వౌలిక వసతులు, మెట్రో ప్రయాణించేందుకు అనుసరించాల్సిన విధానాన్ని ఎన్వీఎస్‌రెడ్డి ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన మెట్రోరైలు ప్రాజెక్టు ప్రతిపాదనల స్థాయి మొదలుకుని రైలును పట్టాలెక్కించే వారు ఎదుర్కొన్న అడ్డంకులను ఎంతో చాకచక్యంగా, వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నామని వివరించారు.