రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

28-12-2017

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

శీతాకాల విడిది ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తదితరులు వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు శాలువా కప్పి వెండి కాకతీయ తోరణం జ్ఞాపికను బహూకరించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ పర్యటనను ముగించుకుని హకీంపేట వైమానిక శిక్షణా కేంద్రం నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.