రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు

రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు

27-12-2017

రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన నిలయంలో తేనీటి విందునిచ్చారు. రాష్ట్రపతి సతీమణి సవిత, కుమార్తె స్వాతి, రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ఆయన సతీమణి విమలా నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఇందులో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, శాసనసభాపతి మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌, విపక్ష నేత జానారెడ్డి, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, ఇతర ప్రముఖులూ పాల్గొన్నారు. విందుకు హాజరైన వారిని రాష్ట్రపతి పేరుపేరునా పలకరించి, కరచాలనం చేశారు.