ఉగాదిని జరుపుకోకుంటే తెలుగువారే కాదు

ఉగాదిని జరుపుకోకుంటే తెలుగువారే కాదు

27-12-2017

ఉగాదిని జరుపుకోకుంటే తెలుగువారే కాదు

తెలుగువారంతా నూతన సంవత్సరాదిగా ఉగాది పండగనే జరుపుకోవాలని పరిపూర్ణనంద స్వామి అన్నారు. ఉగాది పండుగకి కులం, మతంతో సంబంధం లేదని, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈ పండగను జరుపుకోవాలని సూచించారు. క్రైస్తవులు, ముస్లింలు తమ ప్రార్థన మందిరాలలో ఉగాది పచ్చడిని పంచుకోవచ్చని, వారి దేవుళ్లను వారు ప్రార్థించుకోవచ్చని తెలిపారు. ఉగాది జరుపుకోని వారు తెలుగువారే కారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం అనగానే ఆంగ్ల క్యాలండర్‌లోని జనవరి 1వ తేదీ అని భావిస్తున్నారని, ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అనే భావనే మాయమైందని అన్నారు. తెలుగు వారికి ఉగాది ప్రత్యేకం అని, సృష్టి ఆరంభం ఉగాది నుంచే మొదలవుతుందన్నారు. యంత్రాలు, సాంకేతిక పరికరాలు అందుబాటులోలేని కాలంలోనే సూర్యచంద్ర గ్రహణాలను గణించిన గొప్ప ఘనత మన దేశానిదని అన్నారు ఉగాదినే నూతన సంవత్సరాన్ని వేడుకలుగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు జ్యోతిష్య పంచాంగం ఒక అద్భుతమైన దిక్సూచి అని కొనియాడారు. ప్రభుత్వం కూడా ఉగాదిని ప్రోత్సహించాలని, తెలుగు సంస్కృతిని చాటే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.