ప్రముఖ ధ్యాన కేంద్రం రామచంద్రమిషన్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో ఏర్పాటు చేసిన కన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో కలసి హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రామచంద్ర మిషన్ మాస్టర్ కమలేశ్ పాటిల్‌తో కలసి ధ్యానమందిరంలో సుమారు గంటపాటు తిరిగి పరిశీలించారు.ఈ సందర్భంగా శాంతివనంలోని 3 నాగవలి మొక్కలను ఆయన నాటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌లోని బొల్లారం విడిది కేంద్రానికి బయలుదేరారు.