హైదరాబాద్‌లో ‘స్వీట్ ఫెస్టివల్’

హైదరాబాద్‌లో ‘స్వీట్ ఫెస్టివల్’

24-12-2017

హైదరాబాద్‌లో ‘స్వీట్ ఫెస్టివల్’

హైదరాబాద్‌లో త్వరలో తీపి పండగ (స్వీట్ ఫెస్టివల్) జరగబోతోంది. ఈ ఫెస్టివల్ కోసం ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. స్వీట్ షాపుల దుకాణదారులు, సంఘాల ప్రతినిధులు తదితరులతో తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం శనివారం సమావేశం నిర్వహించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కూడా వర్తక, వ్యాపారవేత్తలు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు పేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం వెయ్యి రకాల తీపి పదర్థాలను ఈ సందర్భంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన స్వీట్స్ ఈ ప్రదర్శనలో ఉంచాలని భావిస్తున్నామని వెంకటేశ్వం వివరించారు.