తెలంగాణపై రాహుల్ దృష్టి

తెలంగాణపై రాహుల్ దృష్టి

24-12-2017

తెలంగాణపై రాహుల్ దృష్టి

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎఐసిసి పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ  ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 2019లో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలోగా తెలంగాణను కలియ తిరగాలని ఆయన భావిస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా రాహుల్ టి.పిసిసి నాయకత్వాన్ని ఆదేశించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రాహుల్ ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. తెలంగాణలో కొద్దిగా కష్టపడితే పార్టీని కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ మరింత బలోపేతం చేసుకుని, అధికారం చేపట్టవచ్చని ఆయన భావిస్తున్నారు. లోక్‌సభ సీట్లనూ ఎక్కువ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందని రాహుల్ ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరకూ రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర నేతలు ఆయనను ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.