పురాత‌న ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

పురాత‌న ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

23-12-2017

పురాత‌న ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రాష్ట్రంలో నూత‌న ఆల‌యాల నిర్మాణం, పురాత‌న ఆలయాల అభివృద్ధి ప‌నులను వేగవంతం చేయాల‌ని తెలంగాణ‌ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స‌ర్వ శ్రేయో నిధిపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంబంధిత అధికారుల‌తో స‌చివాల‌యంలోని ఆయ‌న చాంబ‌ర్ లో ఈ రోజు స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో నూత‌న‌ ఆల‌యాల నిర్మాణం, పురాత‌న ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 615 నూత‌న ఆల‌యాల నిర్మాణానికి రూ.159 కోట్లు, బ‌ల‌హీన వ‌ర్గాల కాల‌నీల్లో నిర్మించే 239 ఆల‌యాల‌కు రూ.23 కోట్లతో చేప‌ట్ట‌బోయే ప‌నుల‌కు కామ‌న్ గుడ్ ఫండ్ క‌మిటీ ఆమోదం తెలిపింది.