తెలుగు మహాసభల నిర్వహణపై ఎన్నారై ప్రతినిధుల బృందం హర్షం

తెలుగు మహాసభల నిర్వహణపై ఎన్నారై ప్రతినిధుల బృందం హర్షం

23-12-2017

తెలుగు మహాసభల నిర్వహణపై ఎన్నారై ప్రతినిధుల బృందం హర్షం

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తీరుపై ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్నారైల ప్రతినిధుల బృందం సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు మహాసభల్లో పాల్గొన్న 400 మంది ఎన్నారైలకు ప్రభుత్వం చక్కటి ఆతిథ్యం ఇచ్చిందని ప్రశంసించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై తాము సమగ్రంగా అధ్యయనం చేశామని, ప్రభుత్వ పనితీరు ఎంతో మెరుగ్గా ఉందని వారి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే పెద్దది కాబోతున్నదని వారు పేర్కొన్నారు. గజ్వేల్‌లో మిషన్‌భగీరథ, డబుల్‌ బెడ్‌రూం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వారు అభినందించారు.