మేడారం జాతరకు రాహుల్‌?

మేడారం జాతరకు రాహుల్‌?

23-12-2017

మేడారం జాతరకు రాహుల్‌?

వచ్చే జనవరిలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని రప్పించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరను ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా భావిస్తారు. దేశంలో వివిధ ప్రాంతాల నుండి సుమారు కోటి మంది ఈ జాతరకు హాజరవుతుంటారు. ఆదివాసీలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ జాతర సందర్భంగా రాహుల్‌ను తీసుకురావాలని కాంగ్రెస్‌ కీలక నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై వారు రాహుల్‌గాంధీ కార్యాలయంతో మాట్లాడారు. ఈ జాతరకు కేవలం తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛతీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌,  ఒడిషా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు వస్తుంటారని, ఇది వారికి అత్యంత కీలకమైన ఉత్సవమని వివరించారు. రాహుల్‌గాంధీ వస్తే అన్ని రాష్ట్రాల నుండి వచ్చే ఆదివాసీలపై  ప్రభావముంటుందని చెప్పినట్లు తెలిసింది. అలాగే రాహుల్‌ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి భారీ బహిరంగ సభను కూడా తెలంగాణలో నిర్వహించాలని టిపిసిసి భావిస్తుంది. దీంతో సంక్రాంతి తరువాత బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సూత్రప్రాయంగా రాహుల్‌కు కాంగ్రెస్‌ నాయకులు తెలియజేశారు.