ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

23-12-2017

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

నిజాం కళాశాల మైదానంలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వేడుకలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కేక్‌ కట్‌చేసి ప్రారంభించారు. వేడుకలకు మండలి చైర్మన్‌ కే స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాబుమోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబూ ఫసియుద్దీన్‌, రెవరెండ్‌ తుమ్మబాల, పురుషోత్తం, డానియల్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ క్రిస్టియన్లకు ప్రాధాన్యం కల్పించి ప్రభుత్వం తరపున క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించడం పట్ల పలువురు క్రైస్తవ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.