వైకుంఠధామాన్ని సందర్శించిన ఎన్నారైలు

వైకుంఠధామాన్ని సందర్శించిన ఎన్నారైలు

22-12-2017

వైకుంఠధామాన్ని సందర్శించిన ఎన్నారైలు

జిల్లా కేంద్ర సిద్ధిపేటలోని వైకుంఠధామం, కోమటి చెరువు, నర్సపురం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఎన్నారైల బృందం సందర్శించింది. ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన సుమారు 40 మంది ఎన్నారైలు సిద్ధిపేటను సందర్శించి పలు అభివృద్ధి పనులను చూసి సంబురపడ్డారు. సిద్ధిపేటలో జరుగుతున్న అభివృద్ధిని జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ దగ్గరుండి ఎన్నారైలకు చూపించారు. ఈ సందర్భంగా ఎన్నారైలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే సంతోషంగా ఉందన్నారు. మిషన్‌ భగీరథ, కాకతీయ గొప్ప పథకాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వడంతో  ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరుతాయన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు దేశానికి మోడల్‌గా నిలిచాయని పేర్కొన్నారు.