24న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక
MarinaSkies
Kizen

24న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక

22-12-2017

24న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం ఈ నెల 24న హైదరాబాద్‌కు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. అదేరోజు రాత్రి రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో నిర్వహించే విందుకు హాజరవుతారు. 26న రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందును నిర్వహిస్తారు. రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల బస అనంతరం ఆయన 27న హైదరాబాద్‌ నుంచి అమరావతికి బయల్దేరి వెళతారు.