హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక సదస్సు

హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక సదస్సు

21-12-2017

హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక సదస్సు

ప్రపంచ తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న హైదరాబాద్‌ మరో ప్రతిష్ఠాత్మకమైన సదస్సుకు వేదిక కానుంది. 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. 3వ తేదీన సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సును ప్రతి సంవత్సరం దేశంలోని ప్రముఖ నగరంలో నిర్వహిస్తుంటారు. 2016లో ఏపీలోని తిరుపతిలో జరగడం విశేషం. ఈ ఏడాది హైదరాబాద్‌ వేదిక అవుతోంది. దీంతో ఏకంగా 7వ సారి ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు హైదరాబాద్‌ అతిథ్యం ఇస్తుండడం విశేషం.