గజ్వేల్‌లో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

గజ్వేల్‌లో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

20-12-2017

గజ్వేల్‌లో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్ర అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాల నుంచి వచ్చిన 450 మంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రగతి భవన్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, డబుల్‌ బెడ్‌రూం పనులను పరిశీలించి, అభివృద్ధిలో భాగస్వామలు కావాలని ఎన్‌ఆర్‌ఐలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గజ్వేల్‌ నియోజకవర్గంలో కోమటిబండకు ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు చేరుకున్నారు. అక్కడ గుట్టపై చేపట్టిన మిషన్‌ భగీరథ ట్యాంకుల నిర్మాణాలను ఎన్‌ఆర్‌ఐ బృందం పరిశీలించింది. ఎడ్యుకేషన్‌ హబ్‌, డబుల్‌ బెడ్‌రూం పనులను పరిశీలించనున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎన్‌ఆర్‌ఐలు పరిశీలించనున్నారు.

Click here for Photogallery