బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్రపతి

బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్రపతి

20-12-2017

బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్రపతి

హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహాన్ని  భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సందర్శించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు. ప్రత్యేక బోటులో వీరు బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీ భద్రతను చేపట్టారు. బుద్ధవిగ్రహ సందర్శన అనంతరం రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజ్‌భవన్‌ వద్ద ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.