శీతాకాల విడిదికి రాష్ట్రపతి

శీతాకాల విడిదికి రాష్ట్రపతి

09-12-2017

శీతాకాల విడిదికి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవనం నుంచి ఉత్తర్వులు అందాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కోవింద్‌ ఈ నిలయానికి రావడం ఇదే తొలిసారి.