గల్ఫ్‌ బాధితులను మహాసభలకు ఆహ్వానించాలి

గల్ఫ్‌ బాధితులను మహాసభలకు ఆహ్వానించాలి

08-12-2017

గల్ఫ్‌ బాధితులను మహాసభలకు ఆహ్వానించాలి

ఈ నెల 15 నుంచి జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు గల్ఫ్‌ బాధితులను ఆహ్వానించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గల్ఫ్‌ బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని అన్నారు. గల్ఫ్‌ దేశాల్లో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తెలుగు మహాసభలు నిర్వహించడం మంచిదేనని అన్నారు. ప్రతిపక్షాలను తెలుగు మహాసభలకు ఆహ్వానించాలని అన్నారు.