అమెరికా కంపెనీ ప్రతినిధులతో మంత్రి జగదీష్‌రెడ్డి సమావేశం

అమెరికా కంపెనీ ప్రతినిధులతో మంత్రి జగదీష్‌రెడ్డి సమావేశం

07-12-2017

అమెరికా కంపెనీ ప్రతినిధులతో మంత్రి జగదీష్‌రెడ్డి సమావేశం

సమజాభివృద్ధిలో కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కీలకమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. తన నివాసంలో అమెరికాకు చెందిన సైన్‌చోని ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ కేంద్రంలో కార్యకలపాలు నిర్వహిస్తుతున్న ఈ కంపెనీ గతంలో సూర్యాపేట నియోజక వర్గ కేంద్రంలోని ఆరు గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైన్‌చోని కంపెనీ సిఈఓ కుర్ట్‌ గ్రోస్సియంతో పాటు టామ్‌ ఆర్కిరి కతే వోగ్త్‌ పైసల్‌ ఖాన్‌, సునీల బిజ్ధాని, రమేష్‌బాబు, వెంకట్‌లను మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఈ తరహా సేవల అందించేందుకు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో కార్పోరేట్‌ సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.