తిరుమల, చార్మినార్‌కు అరుదైన గుర్తింపు

తిరుమల, చార్మినార్‌కు అరుదైన గుర్తింపు

22-11-2017

తిరుమల, చార్మినార్‌కు అరుదైన గుర్తింపు

చారిత్రక చార్మినార్‌, తిరుమల ఆలయాన్ని స్వచ్ఛ ఐకాన్లుగా కేంద్రం గుర్తించింది. దేశవ్యాప్తంగా పది సాంప్రదాయక స్థలాలకు స్వచ్ఛ ఐకాన్లుగా గుర్తిస్తూ రెండో జాబితా విడుదల చేసింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన రెండు రోజుల జాతీయ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన, చారిత్రకమైన సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను అత్యున్నత స్థాయి స్వచ్ఛ నమూనాలుగా గుర్తించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ గుర్తింపు పొందిన వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది.

చార్మినార్‌, తిరుమల తిరుపతి దేవస్థానం, గంగోత్రి, యమునోత్రి, మహంకాళేశ్వర ఆలయం, గోమఠేశ్వర ఆలయం, బైద్యనాథ్‌ థామ్‌, గయాతీర్థ్‌, సోమనాధ్‌ ఆలయాలను ఈ రెండో జాబితాలో స్వచ్ఛ ఐకాన్లుగా గుర్తించింది. ఏడాది పాటు ఈ గుర్తింపు పొందిన ప్రాంతాల్లో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాలను చేపడతారు.