రోడ్డునపడ్డ అమెరికా వాసి

రోడ్డునపడ్డ అమెరికా వాసి

22-11-2017

రోడ్డునపడ్డ అమెరికా వాసి

హైదరాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన రబియా బషీరా (45)కు అమెరికా పౌరసత్వం ఉన్నది. 1998లో నిజామాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ నయీంతో పెండ్లయింది. 2000 సంవత్సరంలో నయీం అమెరికా వెళ్లిపోయారు. 2007లో రబియా అమెరికా వెళ్లింది. ఆమెకు గ్రీన్‌కార్డు కూడా వచ్చింది. తర్వాత భర్త చనిపోవడంతో హైదరాబాద్‌లోని కూతుళ్ల వద్దకు వచ్చింది. రబియా సమీప బంధువులు ఆమెను మోసం చేసి ఆస్తి మొత్తాన్ని గుంజుకున్నారు. దీంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో దర్గా వద్ద భిక్షాటన చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి తిరిగి అమెరికాకు పంపించాలని ఆమె కోరుతున్నది.