హైదరాబాద్‌ అంతా అలర్ట్‌

హైదరాబాద్‌ అంతా అలర్ట్‌

18-11-2017

హైదరాబాద్‌ అంతా అలర్ట్‌

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక పర్యటన కోసం హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 27న నగరంలో జరిగే గ్లోబల్‌ ఎంట్రీప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌కు వీళ్లు హాజరు కానున్నారు. దీంతో నగరం అంతా అలర్డ్‌ అయింది. తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మోదీ, ఇవాంక డిన్నర్‌ ఉన్నందున, ఆ ప్రాంతంలో సెక్యూరిటీని టైట్‌ చేశారు. ఫలక్‌నుమా ఏరియా మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇవాంక చార్మినార్‌, లాడ్‌ బజార్‌, చౌహమల్లా ప్యాలెస్‌ను సందర్శించనున్నారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌, యూఎస్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌, ఆక్టోపస్‌ కమాండోస్‌, గ్రేహౌండ్‌ సిబ్బంది, నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ, ఇవాంక సందర్శించే  ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్నిపర్‌ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. తాజ్‌ ఫలక్‌నుమా ఏరియాలో దాదాపు 3500 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగించనున్నారు. ఇక ఫలక్‌నుమా దగ్గరల్లోని ఫాతిమా నగర్‌, ఫరూఖి నగర్‌, అల్‌ జుబేల్‌ కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసే పనిలో పడ్డారు పోలీసులు.