కువైట్‌ - హైదరాబాద్‌ల మధ్య విమానం

కువైట్‌ - హైదరాబాద్‌ల మధ్య విమానం

18-11-2017

కువైట్‌ - హైదరాబాద్‌ల మధ్య విమానం

కువైట్‌కు చెందిన చౌక విమాన సంస్థ జజీరా ఎయిర్‌వేస్‌ భారత్‌కు తన సేవలను విస్తరించింది. కువైట్‌- హైదరాబాద్‌ల మధ్య ప్రతిరోజూ విమానాన్ని నడపనుంది. 2018 జనవరి నుంచి కోచి, ముంబయి, అహ్మదాబాద్‌కు సేవలు అందిస్తామని జజీరా ఎయిర్‌వేస్‌ సీఈఓ రోహిత్‌ రామ చంద్రన్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కువైట్‌లో ఉన్న 10 లక్షల మంది భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎస్‌జీకే కిశోర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌కు విమానాలు నడపాల్సిందిగా యూరోపియన్‌ విమాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.