గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ సక్సెస్ చేయాలి

గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ సక్సెస్ చేయాలి

10-11-2017

గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ సక్సెస్  చేయాలి

హైదరాబాద్ హైటెక్‌సిటీలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ కు ఏర్పాట్లు నగరషాన్‌కు తగినట్టు ఉండాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. ఇందుకు వివిధశాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. సమ్మిట్ నిర్వహణను అధికారులందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2017నిర్వహణ ఏర్పాట్లపై గురువారం వివిధశాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ సదస్సును నిర్వహించే అవకాశం మన రాష్ట్రానికి వచ్చిందని, మన ప్రతిభ ప్రతిబింబించేలా సక్సెస్ చేయాలని కోరారు. నిర్వహణ సబ్ కమిటీలు నిత్యం పనులను సమీక్షిస్తూ, సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులకు ఎక్కడా చిన్న ఆటంకం కలుగకుండాసర్వం సిద్ధంచేయాలన్నారు. విమానాశ్రయంలో అతిథులకు స్వాగతం, కిట్స్, ట్రావెల్ రూట్ మ్యాప్స్, బస్సుల వరకు ఎస్కార్ట్‌లకు వలంటీర్లతో సహకారం, హోటళ్లలో తగువసతి, భద్రత, రవాణా ఏర్పాట్లు కల్పించాలన్నారు. 

Click here for PhotoGallery