సీఎం కేసీఆర్‌ పోటీ చేసినా గెలుపు నాదే
MarinaSkies
Kizen
APEDB

సీఎం కేసీఆర్‌ పోటీ చేసినా గెలుపు నాదే

09-11-2017

సీఎం కేసీఆర్‌ పోటీ చేసినా గెలుపు నాదే

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి తాను బరిలోకి దిగి విజయం సాధిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. తనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీచేసినా ఓడిపోవడం ఖాయమనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 50వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన చెప్పారు. ఒకవేళ తాను ఓటమిపాలైతే రాజకీయాల నుండి తప్పుకొంటానని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.