అట్టహాసంగా అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం వేడుకలు

అట్టహాసంగా అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం వేడుకలు

09-11-2017

అట్టహాసంగా అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం వేడుకలు

అంతర్జాతీయ బాలల చలనచిత్స్రోవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. శిల్పారామంలో ప్రారంభమైన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు 109 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బాలల చలనచిత్ర ఉత్సవాలు నవంబర్‌ 14 వరకు కొనసాగుతున్నాయి. 50 దేశాలకు చెందిన బాలల చలనచిత్రాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి 50 మంది బాల ఆర్టిస్టులు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి 30 మంది, నవోదయ పాఠశాల నుంచి 30 బాల బాలికలు హాజరు కాగా, 12 మంది లిటిల్‌ డైరెక్టర్స పాల్గొన్నారు. ఫిల్మీం మేకింగ్‌,  స్టోరీ టెల్లింగ్‌, యానిమేషన్‌ వంటి విభాగాలకు సంబంధించి మెలకువలు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 13 ప్రాంతాలలో బాలల చిత్రాలు ప్రదర్శించబడుతాయి.