మళ్లీ రాజకీయాల్లోకి రాములమ్మ

మళ్లీ రాజకీయాల్లోకి రాములమ్మ

09-11-2017

మళ్లీ రాజకీయాల్లోకి రాములమ్మ

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చురుకుగా పాల్గొనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీతో విజయశాంతి సమావేశం అయినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యాంగా పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా రాహుల్‌కు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి చురుకుగా పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్‌ బలోపేతం కోసం పనిచేస్తారన్నారు.