తెలంగాణ జానపదం మూగబోయింది
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

తెలంగాణ జానపదం మూగబోయింది

09-11-2017

తెలంగాణ జానపదం మూగబోయింది

తెలంగాణ జానపదం మూగబోయింది. ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పడంలో చుక్క సత్తయ్య నిష్ణాతుడు. 14 ఏళ్ల ప్రాయం నుంచే ఆయన ఈ కళలో రాణించారు. ఒగ్గు కథను దేశవ్యాప్తంగా పాపులర్‌ చేయడంలో ఆయన విశేష పాత్ర పోషించాడు. దేశవ్యాప్తంగా సుమారు 12వేల ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. శివ స్వరూపమైన వీర భద్రుడు విరోచిత కథను గానం చేయడటమే ఒగ్గు కథ అంటారు. పరమశివుడి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆయన అనేక ప్రదర్శనలిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఆయన్ను సన్మానించారు. ఒగ్గు కథా గాన శైలిలో అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన పోరాటం చేశారు. ఉన్నత విధ్య, ఫ్యామిలీ ప్లానింగ్‌, కట్న వ్యవస్థ, మూఢనమ్మకాలు, చెడు అలవాట్ల లాంటిపైన కూడా ఆయన ఒగ్గు కథతో ప్రదర్శనలు చేశారు.