రాములమ్మ రీఎంట్రీ

రాములమ్మ రీఎంట్రీ

06-11-2017

రాములమ్మ రీఎంట్రీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలోని క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున స్టార్‌ క్యాంపెయిన్‌గా విజయశాంతి వ్యవహారించనుంది. సినీ గ్లామర్‌ ఉపయోగించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మళ్లీ బలమైన పునాది పడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి చెందిన కొందరూ ముఖ్యనేతలు కూడా చర్చించగా, అందుకు విజయశాంతి కూడా ఒప్పుకున్నట్లుగా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత నెలలో పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ రాష్ట్రానికి వచ్చినప్పుడు విజయశాంతి ఆయనతో భేటీ అయిన రాజకీయాలపై చర్చించారు. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ రాంచంద్ర కుంతియాతో పాటు రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశమైయ్యారు. దీంతో విజయశాంతి తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారనే చర్చ సాగుతోంది.