నవంబర్‌ 28న మెట్రో తొలిదశ పరుగులు

నవంబర్‌ 28న మెట్రో తొలిదశ పరుగులు

04-11-2017

నవంబర్‌ 28న మెట్రో తొలిదశ పరుగులు

ఈ నెల 28న మెట్రో తొలిదశను ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. పట్టణ రవాణా వ్వవస్థపై హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ నెల 28న నాగోలు- మియాపూర్‌ మధ్య మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెట్రోవ్వవస్థను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 10 మిలియన్ల జనాభా ఉందన్నారు. 17వ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లో జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.