కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ?

కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ?

03-11-2017

కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ?

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కీలకనేతగా ఉన్న కొండా సురేఖ అనంతరం టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. అమె భర్త కూడా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. రెండు సీట్లు ఇస్తే కాంగ్రెస్‌లోకి చేరతామంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలతో రాయబారం నడిపిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పరకాల నుంచి సురేఖ తన కుమార్తెను బరిలోకి దింపే ఆలోచనల్లో ఉన్నట్లుగా సమాచారం. కొండా దంపతుల డిమాండ్‌పై వరంగల్‌ నేతలతో పీసీసీ చర్చిస్తోంది. అయితే కొండ సురేఖ రాను పలువురు నేతలు వ్యతిరేకించగా, మరికొందు నేతలు సాదరణంగా అహ్వానించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

అయితే కొండా సురేఖ డిమాండ్‌పై నిశితంగా ఆలోచించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రస్తుతం కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గాన్ని మాత్రమే ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. అయితే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో కొండా సురేఖ చర్చలు జరుపుతున్నట్లు తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.