అమ్మాయిల సంఖ్య తక్కువ… క్యాథరిన్ హడ్డా

అమ్మాయిల సంఖ్య తక్కువ… క్యాథరిన్ హడ్డా

02-11-2017

అమ్మాయిల సంఖ్య తక్కువ… క్యాథరిన్ హడ్డా

వివిధదేశాల నుంచి అమెరికాలో చదువుకునేందుకు వెళ్తున్నవారిలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటుందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో తాజ్‌కృష్ణలో జరిగిన యూఎస్ యూనివర్సిటీల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2015-16లో 1.66 లక్షలని తెలిపారు. ఇది అమెరికాలో మొత్తం విదేశీ విద్యార్థుల్లో 16 శాతం అని చెప్పారు. ఇందులో చైనా, భారతదేశం ప్రథమ, ద్వితీయస్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాలో ప్రభుత్వ గుర్తింపుపొందిన 2,500 పైగా వర్సిటీలు అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్‌తోపాటు పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు. ఎగ్జిబిషన్‌లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కొలరాడో స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వారి వైటరీబీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ పాల్గొన్నాయి.