పెట్టుబడి అవకాశాలపై సదస్సు

పెట్టుబడి అవకాశాలపై సదస్సు

01-11-2017

పెట్టుబడి అవకాశాలపై సదస్సు

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 4న హైదరాబాద్‌లో ఒక సదస్సు జరుగుతోంది. నగరంలోని తాజ్‌ కృష్ణ హోటల్‌లో ఈ సదస్సు జరుగుతుందని ఎపి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, టూరిజం సబ్‌ కమిటీ చైర్మన్‌ కె.లక్ష్మీ నారాయణ విలేకరులతో చెప్పారు. పర్యాటక రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రాంతీయ పెట్టుబడులు ఆకర్షించేందుకు ఎపి, తెలంగాణల్లోని పలు నగరాల్లో ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.