హైదరాబాద్‌ మెట్రోకు మరో అవార్డు

హైదరాబాద్‌ మెట్రోకు మరో అవార్డు

01-11-2017

హైదరాబాద్‌ మెట్రోకు మరో అవార్డు

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు బెస్ట్‌ అప్‌ కమింగ్‌ మెట్రోరైలు ప్రాజెక్టు ఆఫ్‌ ద ఇయర్‌గా కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా ప్రకటించింది. ఏడేళ్లుగా ఏటా కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా దేశంలో అత్యుత్తమ నిర్మాణ, మౌలిక రంగాల వ్యాపారాలను గుర్తించి బహుమతులను అందజేస్తోంది. ఈ సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు హైదరాబాద్‌ ఎం.డీ అండ్‌ సీఈఓ శివానంద్‌ నింబార్గి మాట్లాడుతూ తమ ప్రాజెక్టుకు వస్తున్న అవార్డులతో తమకు గర్వంగా ఉందన్నారు. నగర ప్రజల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తాయని, ఈ ప్రశంసలు మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేస్తున్న వారికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. అవార్డును అందుకున్న ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు హైదరాబాద్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.పీ. నాయుడు మాట్లాడుతూ దేశంలో ఎన్నో మెట్రో ప్రాజెక్టులు వస్తున్నాయని, హైదారాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు అన్నిటికన్నా మిన్నగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా నుంచి వివిధ కేటగిరీల్లో మూడు అవార్డులు అందుకోగా, ఇది నాల్గో అవార్డు అన్నారు.