కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ రెడ్డి

31-10-2017

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో రేవంత్‌ ఆ పార్టీ  తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్‌కు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్‌. రేవంత్‌తో పాటు ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేంనరేందర్‌ రెడ్డి, విజయ రమణరావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్‌, మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్‌, జంగా యాదవ్‌, హరిప్రియ నాయక్‌, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీమంత్రి దొమ్మాట సాంబయ్య, ఓయూ జేఏసీ నుంచి ఎల్లన్న, బాల లక్ష్మీ, భాస్కర్‌, మధుసూదన్‌ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌ వెంట ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, చిన్నారెడ్డి, వి.హనుమంతరావుతో పాటు ఆయన అనుచరులు ఉన్నారు.

Click here for PhotoGallery