కాంగ్రెస్ పార్టీకి రేవంత్‌రెడ్డి బాహుబలి అని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. రేవంత్ కాంగ్రెస్‌లో చేరుతున్న అంశంపై వర్మ ట్విట్టర్లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే, అందులో రేవంత్ బాహుబలి అంటూ ట్విట్ చేశారు. బాహుబలి బాక్సాఫిస్కి నోట్ల వర్షం కురిపిస్తే, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఓట్ల వర్షం కురిపించడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. రేవంత్ తీసుకున్న నిర్ణయంతో తాను చాలా హ్యాపిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు ప్రజలకు కూడా కాంగ్రెస్‌పై నమ్మకం వచ్చిందన్నారు.