టీడీపీకి మరో షాక్‌
MarinaSkies
Kizen
APEDB

టీడీపీకి మరో షాక్‌

30-10-2017

టీడీపీకి మరో షాక్‌

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు ఇప్పటికే  పార్టీని వీడారు. తాజాగా మరో నేత కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే విజయ రామణారావు తెలుగుదేశం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరుల, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రేవంత్‌ బాటలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని విజయరమణారావు నిర్ణయించారు.