వెళ్లిపోతావా ? రేవంత్ – చంద్రబాబు మధ్య చివరి డైలాగ్ !
Sailaja Reddy Alluddu

వెళ్లిపోతావా ? రేవంత్ – చంద్రబాబు మధ్య చివరి డైలాగ్ !

28-10-2017

వెళ్లిపోతావా ? రేవంత్ –  చంద్రబాబు మధ్య చివరి డైలాగ్ !

తెలంగాణ టీడీపీ నేతల సమావేశం సీరియస్ గా జరుగుతోంది. జనరల్ గా రాజకీయ విషయాలు, కాంగ్రెస్ తో శత్రుత్వం…ఏపీ ఈక్వేషన్స్ తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయ్ అన్నీ మాట్లాడుతూ… లంచ్ తర్వాత మళ్లీ కూర్చుదాం… ఓ ఐదుగురు నేతలు ఎవరో మీరే తేల్చుకొని సిద్ధంగా ఉండండి అంటూ బాబు లేచి లోపలికి వెళ్లారు. బాబుతో పాటు తలుపు తోసుకొని చొరవగా రేవంత్ కూడా ఎంటర్ అయ్యాడు. అక్కడ వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే…చంద్రబాబును రేవంత్ చూస్తుండిపోయాడు ! ఏంటి అంటే… పార్టీలో పరిస్థితులు ముందు ఓ రెండు నిమిషాలు వివరించిన రేవంత్, తాను పార్టీని వీడాలనుకుంటున్నట్టు చెప్పాడు.

కాంగ్రెస్ పై మీ వ్యతిరేకత నాకు తెలుసు అంటూనే… తప్పనిసరి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ లోనే చేరాలంటూ తన వాదన వినిపించాడు. మిగతా వ్యక్తిగత విషయాలు కూడా కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. అంతా విన్న తర్వాత వెళ్లిపోతావా అని చంద్రబాబు అన్నారు రేవంత్ తో ! కళ్లల్లో నీళ్లు తిరుగుతూ… అవును సర్, మీతో చెప్పిన తర్వాతే వెళ్తున్నా అంటూ మాట పూర్తికాక ముందే అక్కడి నుంచి కదిలిపోయాడు. చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. రేవంత్ చరాలున వచ్చి కారెక్కేశాడు. విషయం బైటకి బ్రేకింగ్ లా వచ్చింది.చంద్రబాబుకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పిన, నేను ఎప్పుడూ ఆయన మనిషిని ఢిల్లీలో అయినా ఆ సంగతి చెప్తా – నేను టైమ్ వేస్టు చేసుకోదల్చుకోలే… ఇంకెవరి మీదా నాకు ఇప్పుడు ఒపీనియన్ లేదు అంటూ టీటీడీపీ తగవుల్ని తేలిగ్గా కొట్టేశాడు రేవంత్ ! అంటే ఇవాల్టితో ఓ బంధం బెడిసింది. రేవంత్ ఇక మాజీ టీడీపీ లీడర్.