కంచ ఐలయ్య గృహనిర్బంధం
Sailaja Reddy Alluddu

కంచ ఐలయ్య గృహనిర్బంధం

28-10-2017

కంచ ఐలయ్య గృహనిర్బంధం

సికింద్రాబాద్‌ తార్నాకలో కంచ ఐలయ్యను ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గృహ నిర్బంధంలో ఉన్న ఆయన బయటకు వస్తే అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు టీమాస్‌ నేతలు అక్కడికి చేరుకున్నారు. గృహనిర్బంధం నుంచి ఐలయ్యను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. విజయవాడలో జరిగే సభను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీమాస్‌ నేతలతో సమావేశం అయిన తర్వాత విజయవాడలో జరిగే సభకు తాను హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసారు.