‘కొలువుల కొట్లాట’ జ‌రిపి తీరుతాంః కోదండ‌రాం

‘కొలువుల కొట్లాట’ జ‌రిపి తీరుతాంః కోదండ‌రాం

28-10-2017

‘కొలువుల కొట్లాట’ జ‌రిపి తీరుతాంః కోదండ‌రాం

ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన ‘కొలువుల కొట్లాట’ సభను జరిపి తీరుతామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. సభకు నిరుద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని.. ప్రస్తుతం ఉద్యోగాల కోసమే పోరాడుతున్నామన్నారు. సభకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా.. జాప్యం చేశారని తెలిపారు. కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభను తప్పకుండా, యథాతథంగా జరిపి తీరుతామని స్పష్టం చేశారు.