టీడీపీకి రేవంత్‌ రెడ్డి రాజీనామా

టీడీపీకి రేవంత్‌ రెడ్డి రాజీనామా

28-10-2017

టీడీపీకి రేవంత్‌ రెడ్డి రాజీనామా

అందరూ అనుకున్నట్టే కొండల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరనున్నారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల రేవంత్‌ రెడ్డి వ్యవహారాన్ని సొంత పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్‌ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో చర్చించేందుకు తెలంగాణ తెలుగుదేశం నేతలు విజయవాడకు చేరుకున్నారు. వారితోపాటు రేవంత్‌ కూడా విజయవాడ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ అధినేతకు లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని రేవంత్‌ కలిశారని, ఆ పార్టీలో త్వరలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.