ఆయనపైనే నా పోరాటం : రేవంత్‌

ఆయనపైనే నా పోరాటం : రేవంత్‌

28-10-2017

ఆయనపైనే నా పోరాటం  : రేవంత్‌

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తనకు గౌరవం ఉందని ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు రేవంత్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు బాధ కల్గించాయన్నారు. పార్టీలో తన ఎదుగుదలకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన పోరాటం ఎప్పుడూ టీఆర్‌ఎస్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనేనని సృష్టం చేశారు. ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని తాను అని వెల్లడించారు.