చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీలో ఏం జరుగుతోంది?
Sailaja Reddy Alluddu

చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీలో ఏం జరుగుతోంది?

27-10-2017

చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీలో ఏం జరుగుతోంది?

లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో సీఎం చంద్రబాబు టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ అంశమే ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలిసింది. రేవంత్‌ వ్యవహారంపై పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని చంద్రబాబు సూచించారు. వారి వాదన విన్న అనంతరం రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా తెలుసుకుని పార్టీలో కొనసాగించడమా లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి మాత్రం రేవంత్ రెడ్డిని పార్టీలో కొనసాగిస్తే నష్టం చేకూరుతుందని అధినేతకు సూచించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా టీడీపీలో కొనసాగేందుకు ఇష్టం లేకే, ఏదో ఒకటి తేల్చుకోవాలని ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలతో ములాఖత్ గురించి పార్టీ నేతలు రేవంత్‌ను నిలదీసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబును కలిసి అన్ని విషయాలు చెబుతానన్న రేవంత్ రెడ్డి తన వైఖరిని పార్టీ అధినేతకు స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.