సింగరేణిలో గులాబీ జెండా
MarinaSkies
Kizen

సింగరేణిలో గులాబీ జెండా

06-10-2017

సింగరేణిలో గులాబీ జెండా

సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయ ఢంకా మోగించింది. మొత్తం 11 డివిజన్లలో తొమ్మిందింటో విజయం సాధించింది. ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి, కార్పొరేటు కార్యాలయం, శ్రీరాంపూర్‌, కొత్తగూడెం, రామగుండం 1, 2, 3 డివిజన్లలో గెలుపొందింది. విపక్ష ఏఐటీయూసీ కూటమి భూపాలపల్లి, మందమర్రిలో విజయం సాధించింది.

గతంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠభరితంగా ఈసారి ఎన్నికలు జరగ్గా టీబీజీకేఎస్‌ తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. గుర్తింపు సంఘం హోదా సాధించింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 52534 ఓట్లకు గాను 49873 పోలయ్యాయి. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా ఇల్లెందు డివిజన్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నాయి. నేతలు, కార్మికులు గులాబీ రంగును చల్లుకొంటూ, బాణసంచా పేల్చుతూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. మిఠాయిలు పంచుకున్నారు. మోటారు సైకిళ్లతో ర్యాలీని నిర్వహించారు.