ఘనంగా కాకా జయంతి వేడుకలు
MarinaSkies
Kizen

ఘనంగా కాకా జయంతి వేడుకలు

05-10-2017

ఘనంగా కాకా జయంతి వేడుకలు

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ నాయకుడు జి.వెంకటస్వామి (కాకా) 88వ జయంతి వేడుకలు హైదరాబాద్‌ లో ఘనంగా జరిగాయి. ట్యాంక్‌బండ్‌పై ఉన్న కాక విగ్రహానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వెంకటస్వామి దేశానికి ఆదర్శ రాజకీయనాయకుడని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పలువురు కొనియాడారు.  తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణ ఇవ్వాల్సిందేనని నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తి కాక అని అన్నారు.