జిహెచ్‌ఐఏఎల్ లో కొత్త బ్యాగేజ్ బెల్ట్
MarinaSkies
Kizen

జిహెచ్‌ఐఏఎల్ లో కొత్త బ్యాగేజ్ బెల్ట్

01-10-2017

జిహెచ్‌ఐఏఎల్ లో కొత్త బ్యాగేజ్ బెల్ట్

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ అరైవల్‌లో కొత్త బ్యాగేజ్ బెల్ట్‌ను ఏర్పాటు చేసినట్లు జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జిహెచ్‌ఐఏఎల్) తెలిపింది. పాసింజర్స్ ప్రైమ్ ప్రోగ్రాం కింద 60 మీటర్ల పొడవైన కొత్త బ్యాగేజి బెల్ట్‌ను ప్రారంభించినట్లు జిఎంఆర్ సిఈఓ ఎస్‌జికె కిషోర్ తెలిపారు. దేశంలోని మిగిలిన విమానాశ్రయాల్లో కెల్లా హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకుల రద్దీ 2015-16తో పోలిస్తే, 2016-17లో డొమెస్టిక్ రాకపోకలు పెరిగినట్లు తేలిందని వివరించారు. దీనిని అనుసరించి ఈ కొత్త బ్యాగేజ్ బెల్ట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. దీని వల్ల ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలిగినట్లు అవుతుందని వెల్లడించారు.